#25
రక్షణ కొరకు కృతజ్ఞత
పల్లవి · Pallavi
పరలోకమున నుండు దేవ నీ పదముల కొనియాడెద సేవదురితంబులకు నేను వెరిసి యున్నానని కరుణించినీ సుతుని ధరణి కంపించితివి గాదా అరుదుగా నీ ప్రేమఇంతన దరము గాదో పరమ జనక మరణ పర్యంతంబునిన్ను నే మరువ జాలను వరకృపా నిధి ॥పరలోకమున॥
చరణము 1
యేసు క్రీస్తుని దయచేయకున్న మోసమొందెదనెందుకనగ దోషంబులకు నేను దాసుండనై ప్రతివాసరంబును నీదు భాసుర రాజసములు విడిచివేసటలు గల నరకమున బడి ద్రోసినది న్యాయమౌ గదనా సునాథా పేర్మిచేతను నీ సుతుని నంపించినావు ॥పరలోకమున॥
చరణము 2
ఎన్నరాని మహిమ నుండి యేసు నన్ను బాలంపనేతెంచి యెన్న శక్యము గాక యున్న పాపము లన్నిఛిన్నాభిన్నము చేసి నన్ను సమ్మతిపరప నన్నునగు నా రక్షకుడు తనను తాను అర్పించి వెండియునున్నతుండై లేచి యిప్పుడు సన్నిధానం బొసగె నాకు ॥పరలోకమున॥