#24

సర్వము దేవుని సొత్తు (దావీదు కీర్తన 24)

రాగం: హరికాంభోజి (ఛాయ: సఖులారా సంఘం పంపబడి) · తాళం: ఆది · రచయిత: మల్లెల దావీదు

Category: దైవారాధన — దైవస్తుతి · Open in the hymnal app

పల్లవి · Pallavi
భూమండలము దాని సంపూర్ణతయును లోకమునుభూమండల వాసులను బొల్పార యెహోవావే ॥భూ॥
చరణము 1
యెహోవా సముద్రము మీద భూమి పునాది వేసిమహా జలముల మీద మన దేవుడది స్థిరపరచె ॥భూ॥
చరణము 2
యెహోవా పర్వతమునకు నెక్కంగ పాత్రుడెవ్వడుమహాలయమునందు మరి నిలవ యోగ్యుడెవ్వడు ॥భూ॥
చరణము 3
అపవిత్ర మనసు లేక కపట ప్రమాణము లేకసుపవిత్రమౌ చేతులను శుద్ధాత్మ గలిగినవాడే ॥భూ॥
చరణము 4
అలాటి వాడు ప్రభుని యాశీర్వచనము నొందుభూలోకమున రక్షణ దేవుని నీతి మత్వము పొందు ॥భూ॥
చరణము 5
ప్రభు నాశ్రయించు నట్టి వారు యాకోబు దేవప్రభు సన్నిధానము వెదకు ప్రజలెల్ల నట్టివారే ॥భూ॥
చరణము 6
ద్వారంబులారా ఇక మీ తల లెల్ల బైకెత్తవలెన్రారాజు కొరకు తలుపులారా మిమ్ము నెత్తుకొనండి ॥భూ॥
చరణము 7
ఇలలో మహా మహిమంబు గలిగిన యీ రాజెవ్వడుబలశౌర్యములు యెహోవా బహు శూరుడు యెహోవా ॥భూ॥