#23

దేవుని స్తుతి

రాగం: ముఖారి (ఛాయ: ఓ మా తండ్రి నీదు నామము) · తాళం: చాపు · రచయిత: మాముడూరి సైమన్

Category: దైవారాధన — దైవస్తుతి · Open in the hymnal app

పల్లవి · Pallavi
ఎటుల నీకు స్తుతులు ఒనరింతుము యెహోవా తనయాఎటుల నీకు నుతులు ఒనరింతుము పటుతర పాపంబులనెడి పంకమందు జిక్కి మదిన కిటము పడెడి మమ్ము బ్రోచిదిక్కు చూపినట్టి యేసు ॥ఎటుల॥
చరణము 1
పాపకూపమందు నుండగా బాపవిమోచనాదాపు జేర్చి కాపు జూపితి శాపగ్రస్తులైన మాశాపము విముక్తి జేయ నీ పవిత్ర రక్తమే నాప్రాపుగా నొసంగితివి ॥ఎటుల॥
చరణము 2
భారభరితమైన యాత్మల భారమును దీసిభూరి సౌఖ్యములతో నింపను భారకుండ ఘోరమైనశ్రమల నొంది మరణ మొంది తిరిగి లేచి నీవుధాత్రి మహిమ నొందినట్టి దేవ ॥ఎటుల॥
చరణము 3
నీతిహీనులమై యుండగా నో కర్తవు మాదుబీతలన్ని బాపి నీ కృపన్ నీతి రక్షణ వస్త్రములనుభీతిగ ధరింపజేసి భూతలంబునందు నిన్నుఖ్యాతిగ సేవింప జేసితివి ॥ఎటుల॥
చరణము 4
నిన్ను జేరి నిశ్చలుండనై యీ భూమియందునిన్ను బోలి నడుచుకొనుటకై తిన్నని మార్గమునుజూపి అన్ని కీడులను జయించి పన్నుగా విమలాత్మశక్తి నున్నతముగా నిచ్చిన యేసు ॥ఎటుల॥
చరణము 5
పరమ రాజ్యమందు నిరతము నీతోడనుండకరుణతోడ నెంచుకొంటివి తిరిగి వచ్చి మమ్ముమీ చిరప్రకాశ పురమునందు త్వరగ జేర్చి యందుసుఖము స్థిరముగా నొసంగు దేవ ॥ఎటుల॥