#22

దేవుని ప్రభావ వర్ణన

రాగం: నాట (ఛాయ: యేసు క్రీస్తు దొరికె ననికి) · తాళం: అట · రచయిత: మిక్కిలి సమూయేలు

Category: దైవారాధన — దైవస్తుతి · Open in the hymnal app

పల్లవి · Pallavi
వ్యోమ సింహాసనస్థుడా ఉర్వి పాదపీఠస్థుడామామకీన దయామయుడా మమ్ము గావుమా దేవుడా ॥వ్యోమ॥
చరణము 1
అంతరిక్ష లోకదీప యద్భుతాదృశ్య స్వరూపాఇంత నీ మహిమ నోప నెంతకైనా నా నాలుక చూప ॥వ్యోమ॥
చరణము 2
గాలి రెక్కల పై నెక్కి గాఢాంధకారమునందునేలికవై సంచరించు నట్టి నిన్ను మ్రొక్కుచుందు ॥వ్యోమ॥
చరణము 3
నీతి న్యాయ దీర్ఘశాంతా నిర్మల దయా నితాంతాప్రీతి నుంచవే శ్రీమంతా పెద్దగా నా కాలమంతా ॥వ్యోమ॥
చరణము 4
సర్వ భూలోక పూజితా సత్య సద్గుణ రాజితాగర్వ దుస్స్వభావ హరితా కావునన్నిన్ని నాట పితా ॥వ్యోమ॥
చరణము 5
నమ్మిన యీ నన్ను దూల నాడవు దీనాత్మపాలాక్రిమ్మి నీ ప్రేమతో జాల బ్రోతువు దయాలా వాలా ॥వ్యోమ॥