#21
త్రిత్వమునకు స్తుతి
పల్లవి · Pallavi
త్రిత్వమై నిత్యత్వమున నేకత్వమగు దేవానీ సత్య సామర్థ్యత్వముల నిజ తత్వము గణించినిన్ను నిత్యము స్తుతియించెదను ॥త్రిత్వమై॥
చరణము 1
ఎల్ల లోకంబుల సృజించిన చల్లని తండ్రి నాయులమున నీ గొప్ప వింతలెల్ల సంతోసిల్ల శోభిల్లదలంచెదను ॥త్రిత్వమై॥
చరణము 2
వాసి కెక్కిన పరమ రాజ్య నివాసమును విడిచినశ్రీ యేసు నాథుండను కుమారా దోషములదోషంబు లెల్ల గాచి రక్షించినావు ॥త్రిత్వమై॥
చరణము 3
ఆదరణకారుండవగు శుద్ధాత్ముడా దేవా యామోద నామము నంపబడి యేసు నాథునిసుబోధ లెల్ల బోధపరచి పాదుకొలిపి ॥త్రిత్వమై॥
చరణము 4
ఓ పితా సుతా శుద్ధాత్మా ఒక్క దేవుడవు ఎల్లపాపులను రక్షింప మిగుల నోపికతో నాపదలుబాపి కృప చూపినావు ॥త్రిత్వమై॥