#20

ప్రత్యేక దేవుని స్తుతి

రాగం: శంకరాభరణము · తాళం: అట · రచయిత: యెషయా వీరమార్టిన్

Category: దైవారాధన — దైవస్తుతి · Open in the hymnal app

పల్లవి · Pallavi
పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువావరదూత లైన నిన్ వర్ణింపగలరా ॥పరిశుద్ధ॥
చరణము 1
పరిశుద్ధ జనకుడా పరమాత్మరూపుడానిరుపమ బలబుద్ధి నీతి ప్రభావా ॥పరిశుద్ధ॥
చరణము 2
1పరిశుద్ధ తనయుడా నరరూపధారుడానరులను రక్షించు కరుణా సముద్రా ॥పరిశుద్ధ॥
చరణము 3
పరిశుద్ధమగు నాత్మ వరములిడు నాత్మపరమానంద ప్రేమ భక్తుల కిడుమా ॥పరిశుద్ధ॥
చరణము 4
జనక కుమారాత్మలను ఏక దేవాఘన మహిమ చెల్లును దనర నిత్యముగా ॥పరిశుద్ధ॥