#19

దేవుని మందిరావరణములు (దావీదు కీర్తన 84)

రాగం: హిందూస్థానీ ముఖారి · తాళం: జువ్వ (ఛాయ: సాక్ష్యమిచ్చెద) · రచయిత: ఎం. జే. రామాంజాచార్యులు

Category: దైవారాధన — దైవస్తుతి · Open in the hymnal app

పల్లవి · Pallavi
చూడ గోరెద దేవ మందిరావరణములను చూడ గోరెదచూడ నాకు నాశ గలదు సుందరావరణములవిచూడ నాదు ప్రాణమెంతొ సొమ్మసిల్లుచున్నదహా ॥చూడ॥
చరణము 1
నీదు నివాసములు చూడ నెంతో రమ్యమైతనర నాదు హృదయమునకు నానందమిచ్చునెప్పుడు నెప్పుడు ॥చూడ॥
చరణము 2
జీవము గల ప్రభుని చూడ జీవి నాలో కేకవేసె కోవెలలకు దొరికె గూటి తావు నీ మందిరమున ॥చూడ॥
చరణము 3
పిచ్చుకలకు దొరికె స్థలము ముచ్చట బలిపీఠమెదుట పెట్టుకు తూహలముతోను పిల్లల నవి మందిరమున ॥చూడ॥
చరణము 4
నీదు మందిరంబులోన నిత్య వాసులైనవారు నిక్కముగను ధన్యులగుచు నిన్ను నుతింతురహా ॥చూడ॥
చరణము 5
ప్రభుని వలన బలము నొందు ప్రజలుధన్యులగుదు రిల ప్రాణ ప్రియము యాత్ర చేయుప్రజల మార్గమమర ధరణిను ॥చూడ॥
చరణము 6
నీదు యావరణములలో నేను నొక్క దినము గడుపనెంతో విలువ గల నాకు వేయినాళ్ల బ్రతుకు కన్న ॥చూడ॥
చరణము 7
కానరారు మనము నిప్పుడైన మనము లలర ప్రభునిచూడ మందిరమున కేగి నిండు మనశ్శాంతి బొంది బ్రతుక ॥చూడ॥