#18

క్రైస్తవారాధన

రాగం: నట · తాళం: త్రిపుట · రచయిత: పులిపాక జగన్నాథము

Category: దైవారాధన — దైవస్తుతి · Open in the hymnal app

పల్లవి · Pallavi
కూడుకొని యున్నాము సంఘ ప్రభు కూడుకొని యున్నాముతోడుగా నుండెద ననుచు నమ్ముచు దొడ్డదగు నీ పాద సన్నిధి ॥కూడుకొని॥
చరణము 1
ఎచ్చట నా ప్రియ భక్తులు ఎలమి గూడియున్ననచ్చటికి నే తెంతునని పల్కితి విచ్చటనుండు మమ్మువీక్షించి కృపచేత నిప్పుడు దీవించుమీ యేసు క్రీస్తునాథా ॥కూడుకొని॥
చరణము 2
గత కాలమందున గాని చేతలచే దుర్గతినొంది యుండగా గనుగొంటివి శత సంఖ్య గల పాపయాత్మ స్వరూపా ॥కూడుకొని॥
చరణము 3
నిరతము నీ ప్రేమ నెనరున ధ్యానించి పరమధర్మములందు బ్రవర్తన గలిగి యన్యులకు శుభములునిరంతరంబు చేయగ దిరత మా కొసగుము దేవుని ప్రియ తనయా ॥కూడుకొని॥
చరణము 4
అన్ని శోధనముల అన్ని విపత్తుల అన్నికాలములందు నాదరించి నిన్ను నమ్మిన జనులనీ సంకిటను జేర్చి పన్నుగ గాపాడు ప్రభు యేసు క్రీస్తు ॥కూడుకొని॥
చరణము 5
అమలుండ నగు నన్ను ననుసరించు చుండుననినాజ్ఞ యిచ్చినట్టి వాత్మజులకు నమల మార్గమునందునరుగంగ మాకవు విమలాత్మ దయచేయు వేగంబు మా తండ్రి ॥కూడుకొని॥