#17

దైవారాధన

రాగం: నాదనామక్రియ · తాళం: అట · రచయిత: యేసుదాసు నరసయ్య

Category: దైవారాధన — దైవస్తుతి · Open in the hymnal app

పల్లవి · Pallavi
యెహోవా భజన చేయండి పాప నరులారాఈ రీతి మరచి పోకండి ॥యెహోవా॥
చరణము 1
యేసు పేరిట ప్రార్థనంబు మన దోషములను బోగొట్టనువెరవు భాసుర పరలోక సుఖము కోటి బాధలుమనకున్న సంతోషకరము ॥యెహోవా॥
చరణము 2
యేసు క్రీస్తును గొలువండి యేసు దాసులతోవాదము లాడకండి మోసపు దారి విడువండిదోష రాసుల నుర్విలో జేసుకోకండి ॥యెహోవా॥
చరణము 3
జీవ రక్షకుని నమ్మండి నిత్య సేవలోమెలగక చెడిపోకండి భావించి యాత్మన్ వేడండిదేవ దేవుని నెడబాసి తెరువు విడవకండి ॥యెహోవా॥
చరణము 4
మాయ లోకపు భ్రాంతులు విడిచి మనుష్యాయువుభువిలోన జీలుట్ల దలచి మాయా మార్గము లెల్లమరచి మోక్ష మార్గము మనమున మరవక తలచి ॥యెహోవా॥
చరణము 5
కాయము నొసగిన ప్రభుని యయిదు గాయంబులాత్మలో గానంగ రాదా ఆయువు స్థిరమనితెలిసి మీరు కాయమాత్మయు నిప్పుడు కర్తకు నిచ్చి ॥యెహోవా॥