#16

యెహోవా ప్రేమ (23వ దావీదు కీర్తన)

రాగం: శంకరాభరణము · తాళం: ఆది · రచయిత: పురుషోత్తము చౌదరి

Category: దైవారాధన — దైవస్తుతి · Open in the hymnal app

పల్లవి · Pallavi
యెహోవా నా మొర లాలించెను దన మహా దయను నన్ను గణించెనుఅహర్నిశల దీనహీనుడగు నా దుఃఖ సహాయుడెడు ధ్వని గ్రహించి మనిపెను ॥యెహోవా॥
చరణము 1
పిశాచి గడవిని బడ గొట్టెను దన వశాన నన్ను నిలువ బెట్టెనుప్రశాంత మధుర సువిశేష వాక్యముల నిశాంతమున జేర్చి సేద దేర్చెను ॥యెహోవా॥
చరణము 2
మదాలవము బోలు నా మదినన్ దన ప్రదీప్త వాక్యంబు హతిగాయథేచ్ఛలన్ని గుదించి పాపపు మొదలల్ తుదలల్ నరికి దరికి జేర్చెను ॥యెహోవా॥
చరణము 3
అహిత వస్త్రముల వదలించెను యేసు నాథు రక్తమున ముంచెనువినూత్న యత్నమెందైన నెన్నడు గనన్ వినన్ బ్రేమ నాకు జూపెను ॥యెహోవా॥
చరణము 4
విలాపములకు జవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెనుశిలానగము పై కిలాగి నన్ను సుఖ కళావలూల మనసులోన నిలిపెను ॥యెహోవా॥
చరణము 5
అగణ్య పాపియని ద్రోయక నన్ను గూర్చి తన సుతుని దా గారవించిమృతి కొప్పగించి పాపపు నెగుల్ దిగుల్ సొగసుగా నణంచెను ॥యెహోవా॥