#15

యెహోవా నా కాపరి (23వ దావీదు కీర్తన)

రాగం: శంకరాభరణము (ఛాయ: ఎంత ప్రేమ) · తాళం: ఏక · రచయిత: సరెళ్ల సమూయేలు సుబ్బయ్య

Category: దైవారాధన — దైవస్తుతి · Open in the hymnal app

పల్లవి · Pallavi
యెహోవా నా కాపరి లేమేమి కలుగుదుతన మహా కృపతో బ్రోచి నన్ను మనుపు నాతడే ॥యెహోవా॥
చరణము 1
పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయుచుగడు హెచ్చుగ సౌఖ్యములు సదా ఇచ్చు నాతడే ॥యెహోవా॥
చరణము 2
శాంతికర జలములకు నన్ను సాగజేయుచువిశ్రాంతి ప్రాణమున కొసంగు విభుడు ఆతడే ॥యెహోవా॥
చరణము 3
గాఢాంధకారమైన లోయల గుండ బోయిననే కీడుకు భయపడ నిక నాతోడు ఆయనె ॥యెహోవా॥
చరణము 4
దుడ్డుకర్రతో శత్రువులన్ దరుమ గొట్టుచుదన దొడ్డ దండముతో నీతి దారిలో నడుపు ॥యెహోవా॥
చరణము 5
అందరిలో నన్ను నెంచి యధిక ప్రేమతోగడు విందొసగి తృప్తిపరచు విభుడు ఆయనె ॥యెహోవా॥
చరణము 6
ముఖము కళగా నుండునట్లు మంచి తైలమున్నా సఖుడు నాకు బూయుచుండు సకల వేళలన్ ॥యెహోవా॥
చరణము 7
బ్రతుకు దినములన్నిట నాకు బంటులవలెనేనన్ను వెదకి కృపా క్షేమములు నా వెంటవచ్చును ॥యెహోవా॥