#14
యెహోవా నా కాపరి (23వ దావీదు కీర్తన)
పల్లవి · Pallavi
నాకేమి కొదువ నాధుడుండగ నికనభీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడునా యేక రక్షకుడు గనుక ॥నాకేమి॥
చరణము 1
తనివి దీర మేత మేపను నన్ను సదా మేల్కొనెడిపచ్చిక నదిమి మృదువుగా బండుకొనజేయును గనుక ॥నాకేమి॥
చరణము 2
ఎంత శోధన యెండ యున్న నాకు నెంతకునోరిగదెప్పుడు శాంత జలములు నా చెంతనే యుండునుగనుక ॥నాకేమి॥
చరణము 3
తప్పి పోయిన నన్ను దారిం బెట్టి నన్నుదప్పరిల్ల జేసి నాకు దీరు నలసటనునా తప్పులు మన్నించు గనుక ॥నాకేమి॥
చరణము 4
నీతి మార్గమునన్ నిల్పు నన్ను ప్రభువు నీతిలేని నాకున్ దనను నీతి దయచేయున్స్వనీతిని ద్రుంచున్ గనుక ॥నాకేమి॥
చరణము 5
చావు చీకట్ల శక్తి యుండు ఆహా లోయ లోబడవలసిననునే వెరవకుందు నా దేవుడే తోడు గనుక ॥నాకేమి॥
చరణము 6
మీద పడునట్టి శోధనలన్ ధరణిను నా దరికిరానీక దండము నన్ను బ్రోచుచు నా కాధరణి యౌనుగనుక ॥నాకేమి॥
చరణము 7
పగవారల్ సిగ్గు పడునటుగా నా జగముయెరుగని సౌఖ్య భోజన మగపరుచును హా తగినదే పెట్టున్గనుక ॥నాకేమి॥
చరణము 8
తన యాత్మానంద తైలంబుతో ప్రభువు నన్ను దినముతల యంటి విసుగు కొనక తుడుచును నా కన్నీళ్లన్నీగనుక ॥నాకేమి॥
చరణము 9
పలువిధములైన భాగ్యములతో తండ్రి వెలుపలికిదిగవడలునట్టి వెలగల గిన్నె నా కలిమిగా జేయున్గనుక ॥నాకేమి॥
చరణము 10
బ్రతుకంతయు గృహ క్షేమములు నా వదలకుండవచ్చు నాతో సుదినములు గల నా పదలు సంపద లౌనుగనుక ॥నాకేమి॥
చరణము 11
దురితంబు లుండు ధరణి నాకు నిజము నిరవుగాదింక నెప్పటికి నా పరమ దేవుని మందిరమే నా యిల్లుగనుక ॥నాకేమి॥