#13

నీవే నా సహాయుడవు

రాగం: శంకరాభరణము (ఛాయ: మన మొదటి తల్లిదండ్రులు) · తాళం: త్రిపుట · రచయిత: పులిపాక జగన్నాథము

Category: దైవారాధన — దైవస్తుతి · Open in the hymnal app

పల్లవి · Pallavi
నా కాలగతులు ఇవ్వి నా చేతులను లేవునాదు దేవ యెప్పుడు నీకే వాని మీదనిత్యాధికారంబు నిలిచియుండు ॥నా॥
చరణము 1
తల్లిగర్భంబున దస్ర సృజించితివి ధరణి నన్నునీవు తల్లికన్నను మిగుల దయచేత నేలితివి తండ్రి నన్ను ॥నా॥
చరణము 2
పాప కూపంబునందు పడియుండగా నన్నుబార జూచి చేయి చాపి యేసుద్వార చక్కగా దెచ్చితివిచాలు దేవ ॥నా॥
చరణము 3
సుఖదుఃఖ కాలములు శోధించి పంపుదువుశోభాయుక్త నాకు సుఖము గలగజేయు సొంపుగ వానిచేస్థూల శక్తి ॥నా॥
చరణము 4
సకల కాలంబుల చక్కగ లోబడి నిన్ను నుతింతునన్ను ఆకలంకు నిగా జేయు మనుచు వేడుచునుందునధికాసక్తి ॥నా॥