#12

యెహోవా దేవుని స్తుతి (103వ దావీదు కీర్తన)

రాగం: ఆనందభైరవి · తాళం: ఆది · రచయిత: ముంగమూరి దేవదాసు

Category: దైవారాధన — దైవస్తుతి · Open in the hymnal app

చరణము 1
జీవమా యెహోవా నీకు జేసినమేళ్లను మరవకు నీవు చేసిన పాతకంబులనుమన్నించి జబ్బు లేమియు లేకుండ జేయునుఆ కారణముచే ॥దేవ॥
చరణము 2
చావు గోతినుండి నిన్ను లేవనెత్తి దయనుకృపను జీవ కిరీటముగ వేయును నీశిరసుమీద జీవ కిరీటముగ వేయునుఆ కారణముచే ॥దేవ॥
చరణము 3
యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్తయౌవనంబై వెలయునట్లుగా మేలు తినిపిచ్చినీదు భావమును సంతుష్టిపరచునుగాఆ కారణముచే ॥దేవ॥
చరణము 4
ప్రభువు నీతి పనులు చేయున్ బాధితులకున్యాయమిచ్చున్ విభుండు మార్గము తెలియజెప్పిమోషేకు దన కార్యములను విప్పెనుఇశ్రాయేలు జనమునకు ఆ कारणముచే ॥దేవ॥
చరణము 5
అత్యధిక ప్రేమ స్వరూపియైన దీర్ఘశాంతుడు నిత్యము వ్యాజ్యము చేయడుఆ కడు కృపోన్నతుడు నీ పేరు నెప్పుడుకోపముంచడు ఆ కారణముచే ॥దేవ॥
చరణము 6
పామరులమని ప్రత్యుపకార ప్రతిఫలంబులుపంపలేదు భూమి కన్న ఆకాశంబున్నయెత్తుండు దైవ ప్రేమ భక్తి జనులందునఆ కారణముచే ॥దేవ॥
చరణము 7
పడమటికి దూరేంత యెడమో పాపములకునుమనకు నంత యెడము కలుగజేసియున్నాడుమన పాపములను ఎడముగానే చేసియున్నాడుఆ కారణముచే ॥దేవ॥
చరణము 8
కొడుకులపై తండ్రి జాలి పడు విధముగాభక్తిపరుల యెడల జాలి పడును దేవుడుతన భక్తిపరుల యెడల జాలి పడును దేవుడుఆ కారణముచే ॥దేవ॥
చరణము 9
మనము నిర్మితమైన రీతి తనకు దెలిసియున్నసంగతి మనము మంటివారమంచునుజ్ఞాపకముచేసి కొనుచు కరుణ చూపుచుండునుఆ కారణముచే ॥దేవ॥
చరణము 10
పూసి గాలి వీవ నెగిరి పోయి బసనుతెలియని వన వాస పుష్పము వలెనేనరుడుండు నరుని ఆయువు తృణ ప్రాయముమన దేవ కృప మెండు ఆ కారణముచే ॥దేవ॥
చరణము 11
పరమ దేవ నిబంధన నాజ్ఞలు భక్తితో గైకొనుజనులకు నిరతమును కృప నిలిచి యుండునుయెహోవా నీతి తరములు పిల్లలకునుండునుఆ కారణముచే ॥దేవ॥