#11
దేవుని వైపు చూచుట
పల్లవి · Pallavi
చూచుచున్నాము నీ వైపుమా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపుచూచుచు నీ ప్రేమ సొంపు సువార్తనుజాచుచు కరములు చక్కగా నీ వైపు ॥చూచుచు॥
చరణము 1
మేమమరులమై యుంటిమి మార్గము వీడిమేము మందరము పోతిమి ప్రేమచే నప్పుడుప్రియ తనయు నంపించి క్షేమమార్గముమాకు బ్రేమను జూపితివి ॥చూచుచు॥
చరణము 2
నిన్ను నమ్ము పాపులకు వారెవరైనానీ శరణు జొచ్చువారలకుఇనుడవు కేడెంబు నీ జగతిలోనగుచు గనపరుచుచుందువు ఘనమైన నీ కృపన్ ॥చూచుచు॥
చరణము 3
నీ భయము మా యెదలను నిలుపుము నీదుప్రాభవమొనరంగను నీ భయముచే మేమువైభవ మొందుచు నే భయము లేకుండనీ భువిని గొన్నాళ్లు ॥చూచుచు॥
చరణము 4
దయచూసి మమ్ము నెప్పుడు మంచివి యన్నిదయచేయు మెల్లప్పుడు దయచేయ రావికదయచేయుమని కోర దయజూపి మన్నించుదయగల మా తండ్రి ॥చూచుచు॥