#10
దేవుని ప్రేమ
పల్లవి · Pallavi
ఎంత ప్రేమ యెంత ప్రేమ యెంత ప్రేమయాదేవుండంత గొప్ప ప్రేమయై వెలుగుచుండునే ॥ఎంత॥
చరణము 1
ఎంత లోతు ఎంత నిడివి యెంత విరివియాదాని నింత యంతయని వచించు మనుజుడెవ్వడు ॥ఎంత॥
చరణము 2
మనమున దలపోయ నూహకంద దెంతయున్దాని జనువుగ జగమందు బొగడ మాటలందవే ॥ఎంత॥
చరణము 3
దేవదూతలైన దాని బాడలేరటఇంక దేవుడే తన సుతునొసంగె ఇంత యది యనెన్ ॥ఎంత॥
చరణము 4
ఇంత గొప్ప ప్రేమ జూప నూరకుందునేప్రభు జంతు జేరి సంతతంబు ప్రీతి జేసెదన్ ॥ఎంత॥