#9

స్తుతి గీతము

రాగం: శంకరాభరణము · తాళం: ఏక · రచయిత: చెట్టి భానుమూర్తి

Category: దైవారాధన — దైవస్తుతి · Open in the hymnal app

పల్లవి · Pallavi
ప్రబలముగానే ప్రస్తుతించెదప్రభుని కృపలన్నిప్రతి దినము నిన్ను ప్రచురపరచెదప్రభుడ నా విభుడా ॥ప్రబలముగా॥
చరణము 1
పొందు గోరి నా యందు నిలిచినబంధు మిత్రుడవు మందమతికానందమొసగిన మహిమతేజుడవు ॥ప్రబలముగా॥
చరణము 2
చింత దీర్చి నా భ్రాంతి మార్చితివెంత వింతదియో స్వాంతమునకడు శాంతి గూర్చితి వెంత కరుణదియో ॥ప్రబలముగా॥
చరణము 3
నీతి గరపిన జాతి మరపినఖ్యాతి యేసునిదేనీరసుడ నన్ను గారవించిన నీతిరాజుడే ॥ప్రబలముగా॥
చరణము 4
జీవమిచ్చిన జావమిచ్చినదేవ సుతుడ నీవేజీవదాయక బ్రోవరా ఇక జా లమేలనురా ॥ప్రబలముగా॥
చరణము 5
నిమిష నిమిషము నిన్ను భజియించెదనెమ్మనంబునను శమదమాదిసుగుణ శోభిత సమ్మతిని నిమ్మా ॥ప్రబలముగా॥