#279
ప్రభు రాత్రి భోజన మాచరించునప్పుడు దీవెన గోరుట
పల్లవి · Pallavi
దేవా దీవించు మిప్పుడు – దీన జనాళినిన్ – గావ రారమ్ము ఎల్లప్పుడు – నీ వరగు బల్ల యొద్ద – నిజ దాసులిటుల గూడి – పావన సంస్కారమును – బంచి పా లొందుచుండ ॥దేవా॥
చరణము 1
మమ్ము గావ నైదు గాయముల్ – పొందిన దేవ – సముడా నీ రక్త కాయముల్ – విమలంపు భక్తి ద్వారా – వీక్షించి మనసులందు – అమిత దుఃఖ మొందుట చేత – నలిగిన భక్తి జనులన్ ॥దేవా॥
చరణము 2
నీ రాజ్యమునకు మమ్ము జేర్ప – నిజము మా పాప – ఘోర శాపములను దీర్ప – నోరిమిచే మా కొరకు – దారుణముగా నొందిన – క్రూర మరణమును దలచి – కుములుచున్న హృదయులను ॥దేవా॥
చరణము 3
కోరి నిన్ను గొలుచు భక్తుల – కోరిక లభివృద్ధి – గా రాజిల జేయు శక్తుల – ధారాళముగా నొసంగు – ధనాత్ముండ నీ దివ్యా – కారమందుండి యీ సం – స్కార సమయమున మమ్ము ॥దేవా॥
చరణము 4
మా దారిద్ర్యములు బాపనే – పాపభారంపు – ద్రాను నీ దివ్య మూపుననే – గాదెలిచే భరియించి గడి దొంగ లిరువురిలో – బాధ లొందితి వనుచు – బహుగా దుఃఖించు మమ్ము ॥దేవా॥
చరణము 5
నీ వీ విధంపు మరణముచే - నిజముగా మమ్ము - జీవింపజేసి నిల్పుటచే - పావనదేవ మేము - ప్రభు సంస్కారము మా మా - జీవాత్మ లాదరణకై - క్షేమముగా గైకొందుము ॥దేవా॥