#280

ప్రభు రాత్రి సంస్కార విందు

రాగం: కేదారగౌళ (ఛాయ: సోదరులారా గనుడి యాశ్చర్యం) · తాళం: అట · రచయిత: వి. డి. జాన్ సుందరరావు

Category: ప్రభు రాత్రి భోజనము · Open in the hymnal app

పల్లవి · Pallavi
చేరి భుజియింపుడి విందు – యేసు – సిద్ధపరచిన కృపా విందు – తోరణంబగు మేడ గదిలో – జేరి శిష్యుల తోడ సిలువ – భారమును మదినెంచి నెరపిన – భావ గర్భితమైన విందు ॥చేరి॥
చరణము 1
జీవాహారము దైవసుతుడే – పరమ – జీవజలముల దాత యితడే – జీవనాథుని రక్త – మేనులు – జీవనాహారములు కాగా – చావును దొలగించి మృతులస – జీవులనుగా మార్చు విందు ॥చేరి॥
చరణము 2
కారుణ్యనిధి యేసు రాజు – నరుల – గావగా బలియైన రోజు – భారమైన సిలువ కెరయై – పాప భారము పరిహరింప – ధారవోసిన పుణ్యరక్తపు – ధారలను దలపోయు విందు ॥చేరి॥
చరణము 3
దాసగణముల బ్రోవనెంచి – రుధిర – ధారలను గార్చి భరియించి – భాసురంబగు నవ నిబంధన – జేసి సంఘ పునాది వేసి – వాసి మీరగ నిత్య జీవము – బోసినట్టి యేసు విందు ॥చేరి॥
చరణము 4
పాప పరిహారార్థముకై – క్రీస్తు – పడిన ఘోరబాధ కొరకై – యేపు దనరగ సుతులు పాడుచు – యేసునాథుని రాకవరకు – ఆపకుండగ సత్ప్రసాదము – నందుకొని బలమొంద రండి ॥చేరి॥
చరణము 5
విందుతో మొదలిడిన సేవ – యేసు – విందుతో ముగియించె బ్రోవ – విందులోగల మర్మమేదియు – విపులముగా బోధించు క్రీస్తున్ – డెందమున ధ్యానించి యాయన – యందు నమ్మిక గలిగియుందము ॥చేరి॥