#278

జీవాహారము

రాగం: ముఖారి (ఛాయ: నాకై బలియైన యుగయుగముల) · తాళం: ఆది · రచయిత: ఎ. బి. మాసిలామణి

Category: ప్రభు రాత్రి భోజనము · Open in the hymnal app

పల్లవి · Pallavi
జీవాహారము రమ్ము – చిరజీవాన్నము నిచ్చి – జీవిత క్షుధ దీర్చుము – జీవనపథములో – చీకటి పడు వేళ – జీర్ణించుకొనిపోవు – జీవితాశలు పెంచ ॥జీవా॥
చరణము 1
విందుగృహమునకేగి – వీక్షింతు భ్రమతో నీ – వివిధసుభోజ్యంబులన్ – విచ్చిన భిన్నమైన నీ – విమల దేహపు విందు – వికలంబౌ మనసుతో – వినుతించి, తినుచుందు ॥జీవా॥
చరణము 2
రుధిర ధారలలోన – రుజువౌ నీ ప్రేమలు – రూపమాయెను పాపము – రుతు ద్రాక్షావల్లి నీ – రుధిరపానముచేత – రుణభారములు తీరి – రుచి యించు నా బ్రతుకు ॥జీవా॥
చరణము 3
భవదీయ స్మరణార్థం – పతితుల శరణార్థం – ఫలియించు నీ హోమము – ప్రభువా నాయాత్మలో – ప్రతిబింబమై వెలసి – పానార్పణంబౌను – ప్రతి రక్త బిందువు ॥జీవా॥
చరణము 4
ఆత్మాంతఃపురములో – ఆంతర్య గదిలోన – ఆరాధింతు నీ నామము – అలనాటి నీ రక్త – నవ నిబంధన నేడు – అపూర్వమైన నాలో – నవతరించును దేవా ॥జీవా॥