#277
ప్రభువు బల్లను సమీపించు యోగ్యతకు ప్రార్థన
పల్లవి · Pallavi
ఓ దయా నిలయా! ప్రభువా! మా – కున్న సతీరీతి – బలముగాక – నీ దయా హృదయంబే నమ్ముచు – నీదగు బల్లను జేర దగియుంటి ॥ఓ దయా॥
చరణము 1
లేదు యోగ్యత బల్లకు దిగువ – లేకిని నేర్చుకొనగ నయినన్ – మాదు గతి గరుfactoryణించియు నెప్పుడు మార్పునులేని ప్రభుండవైతివి ॥ఓ దయా॥
చరణము 2
ఓ ప్రభుండా! కావున మా పా – పాద్భుతంబగు శారీరాత్మల – నీ ప్రియంబగు క్రీస్తు తనువున – నెత్తుట బరిశుద్ధంబగునట్లు ॥ఓ దయా॥
చరణము 3
ఆయన మాలో బరుగను మే – మాయనలో జీవింపగను – నీ యుగాంతముదాక నేకత – నీతో జీవించు లాగుననో ॥ఓ దయా॥
చరణము 4
యుక్తముగా నాయన మాంసమును – నోరముగా భుజియింపను ధనదగు – రక్తము మేమందరమును ద్రావను – రాగం పడరంగా దయచేయుము ప్రభు ॥ఓ దయా॥