#276
మనసా! యాత్మ! తేజరిల్లుమా
పల్లవి · Pallavi
మనసా! యాత్మ! తేజరిల్లుమా – యలంకరించుకొనుము – పాపమంత వీడుమావినుము నేడు యేసు నీకు – ఘనముగాను విందు జేసి – నిను దలచి చేరవచ్చె – ఘనుని వెలుగులోని కేగుము
చరణము 1
హృదయమనెడు తలుపు దట్టుచు – ప్రభు యేసు నిలిచి – సదయుడిదిగొ నిన్ను బిలుచుచు – నెదురు చూచుచుండు విభుని – పదయుగమున కెరగి మ్రొక్కి – ముదముతోడ జేర్చుకొనుము – సదవకాశమగు ప్రేమన్ జూపి
చరణము 2
ధరను సర్వ శ్రేష్ఠ భాగ్యముల్ – వరములను ధనము – నరులు బొందు చుందు రుచితము – పరమ రక్షకుండొసగు – వరశరీర రక్తములకు ధరణి రత్నరాసులైన – జాలునా మరేవియైన
చరణము 3
ఎందుగానరాని ప్రేమను – జూపించి నీకై – పొందుగాను దన ప్రాణ మిచ్చెను – చిందిన రక్తమును యాగ – మందినట్టి శరీరంబు – నందముగాను రాత్రి భోజనంబు నందు సిద్ధపరచే
చరణము 4
యేసు తన దుర్భలత్వమును – సుజీవమిచ్చు – నెల్ల నష్టములు నశించును – భాసురముగా మోక్షమునని – వాసమై శ్రీ యేసు తోడ – ఈ సుభోజనంబు దినుట – కాశీర్వాదముల నొసగు