#275
క్రీస్తును నమ్మి బాప్తిస్మము పొంద రండి
పల్లవి · Pallavi
రండి రండి సువార్త బోధ విన – రారాజులారా – నిండు మనంబుల కోర్కెలూరగను – నిజ రక్షకుడగు యేసుని జేర ॥రండి॥
చరణము 1
పాపము లెడబాపను ఇల కరిగిన – ప్రభువు మహిమ వినుడి – మీ మీ – పాపములను దలపోసి హృదయముల – పశ్చాత్తాపపడి – యా పరమ గురుని నామము ద్వారా – ననుసరించి ముంచడము బొందు ॥రండి॥
చరణము 2
తన మహిమను బలమును – దైవత్వము తగ్గించుకొని వడి – యెప్పుడు తన సేవకుండని మదిన దలపోయెను – తగు నీతిని గనుడి – క్రీస్తుండును – బాప్తిస్మంబు యోహానుచే – మునుకొని యోర్దాను నదిలో – ముంచుట గని ॥రండి॥
చరణము 3
మురియుచు క్రీస్తువు యోర్దాను నదిలో – ముంచబడిన రీతి – నిప్పుడు – గరిమతో క్రీస్తుని నమ్మిన జనములు – గైకొనుటది నీతి – మరువక – స్థిరముగా మీ మనముల నెల్ల – ప్పుడు నరమర విడి క్రీస్తుని తగ జేర ॥రండి॥
చరణము 4
తల్లులు తమ బిడ్డల – కాశీర్వాదము లిమ్మని తేగా – నప్పుడు – చల్లగ బాలుర కాశీర్వాదమొసగె ప్రభు విదిగాక – క్రీస్తుండు – దొల్లి జనములకు ముంచడ మిచ్చిన – యట్ల విధుల లేదు వేదమున ॥రండి॥
చరణము 5
అందుచేత వేదమున – బాప్తిస్మంబున బడె యోహాను – ఇప్పుడు పొందుగ ముంచువారు బాప్తిస్మములు పొసగగా సరిగాను – మీరలు – నందరు విన సత్య వేద వాక్యము