#274

పెద్దల బాప్తిస్మము

రాగం: నవరోజు (ఛాయ: అందమైన క్రీస్తు కథ) · తాళం: అట · రచయిత: విలియం డాకన్

Category: క్రీస్తు శ్రమలు — మరణము · Open in the hymnal app

పల్లవి · Pallavi
ఆచరించుచునున్నాము – ఆ చందము మేము – యే చందమేసు ప్రభు సెల – విచ్చి వేంచేసితో పరమండలికి ॥ఆచరించుచు॥
చరణము 1
నీ సుభక్తుల్ నిఖిలాపొస్తలుల్ – నీ సెలవున నిఖిల భూస్థలుల్ – వాసికీ కెక్కగా జేయుటకు వ్యాపించిరి కోరి – యోసయ్యను రాజ శాశ్వత – శ్రీ సనాథ శ్రితరక్ష భాజ – నీ సుదయచే నీ యుద్యోగము – నిత్యంబును బొంది ॥యాచరించుచు॥
చరణము 2
భాసురత్వత్సమాచార – వాక్యము విని సదా వి – శ్వాస భాగ్యాభి ముఖ స్వాభావుల నీ వేళనన్ – భాసమాన పతితపా – వనతాంకిత పాత్ర దరికు – లాసమున మోక్షములందు – రాజి లగ్నము దెచ్చి ॥యాచరించుచు॥
చరణము 3
పరిశుద్ధ నాధ్యాత్మ మోక్ష – పారావతమా – వీరి – నిత్తరి – నరుదౌ నీ దైవత్వ చి – హ్నముతోడను గూడ – స్రవిగా గతి యను బొందెద రెరుగున నీ బీప్తి స్తోదక ములును – బరిన వ్యాపించి యుండుటకు – ప్రార్థించుచు నిన్ను ॥యాచరించుచు॥
చరణము 4
పరమానంద వదనము నీ – దరిక రాని కోరు వీరి నిన్న – పరమ కృపలన్ దీవించి నీ – కరుణా కటాక్షేక్షలన్ – స్థిరత బార్చి యాత్మలకు – నీ మహిమ కిరణములు – నెరపుమా అభివాయని – నిన్ను వేడుచు ॥నాచరించుచు॥