#273

పిన్న పెద్దల బాప్తిస్మము

రాగం: నీలాంబరి (ఛాయ: వారు భాగ్యవంతులు) · తాళం: త్రిపుట · రచయిత: పులిపాక జగన్నాథము

Category: క్రీస్తు శ్రమలు — మరణము · Open in the hymnal app

పల్లవి · Pallavi
యేసు ఒసంగె గొప్ప యాజ్ఞను – తన శిష్యులకును – యేసు ఒసంగె గొప్ప యాజ్ఞను – దాసులునుగ జేయబోయి – ధరణి మీది రాజ్యములకు – ఆ నను బాప్తిస్మ మిచ్చి – నా సుబోధ నేర్పుడనుచు ॥యేసు ఒసంగె॥
చరణము 1
జనక కుమారాత్మల పేర – బాప్తిస్మ మియ్య – చనుడు మీరు సకల దిశలను – తనయులైనను తల్లులైనను – తండ్రులైనను బొందవచ్చు – దగిన రీతి దాని నిప్పుడు – తండ్రియైన దైవ కృపను ॥యేసు ఒసంగె॥
చరణము 2
బాలురెల్ల బొందవచ్చును – బాప్తిస్మ మిప్పుడు – జాలి జూపు క్రీస్తు సెలవున – బాలురందు ప్రేమ నుంచి – ప్రభువు పిలుచువారి నెల్ల – జాల మేలు చేయగోరి – సకల కాలముల యందు ॥యేసు ఒసంగె॥
చరణము 3
పొందవలయు బాప్తిస్మము – శుద్ధాత్మ చేత – విందు గలుగు మనుజులందరు – మంద బుద్ధి విడిచి పెట్టి – మహిమ గల్గు దేవు గొల్వ – నందముగను లేచి రండి – హర్ష పూర్ణులగుచు మీరు ॥యేసు ఒసంగె॥