#272

శిశు బాప్తిస్మము

రాగం: నాథనామక్రియ · తాళం: ఆట · రచయిత: పులిపాక జగన్నాథము

Category: క్రీస్తు శ్రమలు — మరణము · Open in the hymnal app

పల్లవి · Pallavi
దేవా శిశువుల తెచ్చితిమి – నీవు – దీవించు వీరిన్ – దివ్య కృప మీర ॥దేవా॥
చరణము 1
వీరు పొందిన బాప్తిస్మంబు – గురుతు – వీరు నీవారన – విశదపరపంగ వీరిపై – గురిపించు దయను – వేగ – వీరికి గలుగంగ – విజ్ఞాన ధనము ॥దేవా॥
చరణము 2
నీవొసగు శిశువుల మాకు – దేవ నీవు చేర్చుకొనుము – నీవు కాపాడు జీవ – మార్గమునందు నిలుపు – నిత్య – జీవంబు దయచేసి – శ్రీ యేసు కరుణన్ ॥దేవా॥
చరణము 3
విమలాత్మ బాప్తిస్మమొసగి – వీరి – విమలుల జేయుము – ప్రీతిని దేవా – క్షమ భక్తి ప్రేమ శాంతుల – నొసంగు – శ్రమల వెలుగంగ – సత్య సాక్షులుగా ॥దేవా॥
చరణము 4
వీరులకు తోడై యుండుము – తండ్రి – వీరిని జూడుము – వివిధ మార్గముల – వీరు లోకము విడుచునప్పుడు – దయను – వీరిని చేర్చుకొము – విమలానందమున ॥దేవా॥