#251
పరిశుద్ధాత్మ కుమ్మరింపు
పల్లవి · Pallavi
వినరే యపొస్తలుల కార్యములు – కైస్తవ – లును వారి కవి యెంతో ధైర్యములు – మనసు లొక్కటి చేసి – కొని యట్లు ప్రార్థింప – ఘనముగా విమలాత్మ – చనుదెంచె వారిపై ॥వినరే॥
చరణము 1
పరమండలమునుండి వచ్చెను – పెద్ద – కరువలి వలె శబ్దమిచ్చెను – తిరముగా వార లం – దరు గూడి యున్న మం – దిర మెల్ల నిండె బం – ధురమై తనకు తానే ॥加వినరే॥
చరణము 2
అనలార్చులను దీప్తి ముంచుచు – బీట – లగు జిహ్వల వలె గనుపించుచు – ఘనముగా నొక్కొక్క – జనునిపై – నవి నిల్వ – గను బరిశుద్ధాత్మచే – తను నింపబడిరంత ॥వినరే॥
చరణము 3
వారన్య భాషలతోడను – నాత్మ – ప్రేరణమును జేయు జాడను – ధారాళముగా భాషాం – తరము లాడిరి విన్న – వారి కబ్బురమై – చారము లబ్బడమొంగ ॥వినరే॥
చరణము 4
ముందటి వారిటుల గుంపుగా – మోద – మందుచు దేవుని గొల్చి తా – మందరు చూడగా – వింత వింత పనులు – నందంద చేసిరి – దేవుని దయచేత ॥వినరే॥
చరణము 5
మనము నా రీతిగా గుంపుగా గూడి – మన దేవుని గొల్వగా భూమిలో – మనుజుల కాశ్చర్య – మగు కార్యముల జేయ – నొనగూడు మనసు కా – నందమును గల్గు ॥వినరే॥