#250
పరిశుద్ధాత్ముని బొందుడి
పల్లవి · Pallavi
పరిశుద్ధాత్ముని బొందుము – ప్రభువిచ్చెడు – వరసహాయుని బొందుము – పరిశుద్ధ వర్తనకు – పరమ సహాయంబు – పరము జేరువరకు – పరిపూర్తిగా దొరకు ॥పరి॥
చరణము 1
పరిశుద్ధాత్ముని గలిగిన – మన రక్షణ – పరిపూర్ణమై యుండును – పరమ రక్షకుడిచ్చు – పరిపూర్ణ రక్షణను – పరమానందముతోడ – పరగ గైకొనుమిప్పుడే ॥పరి॥
చరణము 2
పరిశుద్ధాత్మని గలిగిన – బైబిలు వాక్య – పరమసారము తేటగున్ – పరమండలపు తండ్రి – పరిశుద్ధ చిత్తంబు – పొరపాటు లేకుండ – విరివిగా దెలియును ॥పరి॥
చరణము 3
పరిశుద్ధాత్ముని గలిగిన – ప్రార్థనలందు – పరమపాటవ మబ్బును – సరిగా ప్రార్థింపడు – సరణియు దెలియును – వరములను బొందుటకు – తెరువూల బిహరించును ॥పరి॥
చరణము 4
పరిశుద్ధాత్ముని గలిగిన – శోధనముల – పరమవిజయము గలుగును – దురితంపు శోధనల – దొలగింప నా ప్రభువు – పరమశక్తినొసంగి – కరుణతో జయమిచ్చు ॥పరి॥
చరణము 5
పరిశుద్ధాత్ముని గలిగిన – జీవితమెల్లా – పరిశుద్ధముగా నుండును – పరిశుద్ధ జీవితము – కరము సాధ్యంబగును – పరిశుద్ధాత్మని శక్తిన్ – వర్తింప గలమట్లు ॥పరి॥