#249

మార్గదర్శియగు పరిశుద్ధాత్ముడు

రాగం: ఆనందభైరవి (ఛాయ: ఓ మా తండ్రి నీదు నామము) · తాళం: ఏక · రచయిత: దాసరి మోజెస్

Category: క్రీస్తు శ్రమలు — మరణము · Open in the hymnal app

పల్లవి · Pallavi
రమ్ము పరిశుద్ధాత్మ దేవుడా – మమ్మును గృపాస – నముకడకు – నెమ్మది నడుపుమా – మమ్ము నడుపు దీక్షతోడి – రమ్ము విడిచి యాత్మస్వరూ – పమున నరుదెంచిన దై – వమ్ము నీవే కదయెహోవా ॥రమ్ము॥
చరణము 1
లోకయాత్ర చేయునప్పుడు చి – కాకుపడిన – మాకు నీవే మార్గ దర్శివై – వీక్షణొసంగి – మాకరంబు – జేకొని పరిశ్రమము బాపి – సిలువ బడిన వాని కడకు – తెచ్చి కల్సి మమ్ము జేర్ప ॥రమ్ము॥
చరణము 2
భక్తవన వసంత దైవమా – నీయందు – బ్రేమా – సక్త వృద్ధి చేసి మనుపుమా – ముక్తి దాత యేసు విభుని – రక్త మహిమ – దెల్పి యఘము – ముక్తులనుగా జేసి మమ్ము – యుక్త మార్గమందు నిలుప ॥రమ్ము॥
చరణము 3
జీవితంపు బాధ లెన్నియో – పెను బ్రోవులగుచు – నావరించి మమ్ము – దాకిన మాకు నీవే హితుడవుగా చు – భావమిచ్చి భయము నిర్చి – జీవమైన యేసు పాద – సేవకు మము సిద్ధపరచు ॥రమ్ము॥
చరణము 4
పలువిధంబులైన చింతలు – చెలరేగి మమ్ము – కలతబెట్టు నవసరంబున – వలను చెడిన మా మనముల – మలయు వ్యాకులతను మానిపి – వలయు నాదరణము నిచ్చు – పలుకు తోడు వీవయ్యగుచు ॥రమ్ము॥
చరణము 5
తొలి ప్రవక్త లెంద రెందరో – నీ ప్రేరణమున – బలికినట్టి వేదమందున – గల నిగూఢ భావములను – దెలుపు నొజ్జ వీవగుట – దెలిపి వాని మమ్ము జ్ఞాన – కలితమతుల జేయు కొరకు ॥రమ్ము॥
చరణము 6
సడలి వాడిపోవుచున్న మా – విశ్వాస లతను – బలసమృద్ధి నుద్ధరించి మా – యెడద శోధనములకతన – బొడము సంశయాంకురంబు – లడచి ప్రేమ – జ్యోతిమాలో – గడు స్థిరముగా వెలిగజేయ ॥రమ్ము॥
చరణము 7
స్తుతులు నుతులు నీకే చెల్లునుగా – వుత యుగయుగంబు – లతు ల భక్తిని నెన్హొ కొలుతుము – క్షితి నివిడ మమ్ము మోక్ష గతికి నడిపి చేర్పుమయ్య – మృతికి మృత్యువైన వాని వితత సింహాసన పైని ॥రమ్ము॥