#248
పరిశుద్ధాత్ముడా – దిగిరమ్ము
పల్లవి · Pallavi
పరిశుద్ధాత్మ పావురమా – నీ దాసుల పైని – కరుణతో నరుదెంచుమా – పరిశుద్ధుడగు యేసు – పరమున కరిగి యా – దరణకర్తగా నిన్ను – దయచేసె గద మాకు ॥పరి॥
చరణము 1
తండ్రి కుమారాత్మల – యేకాత్మవై – యుండిన పావనుడా – నిండార నీ యాత్మ – నండగ మాకిచ్చి – దండిగ వరముల – దయచేయు మో దేవ ॥పరి॥
చరణము 2
విధిగ వేదము జదివిన – వేమారు సద్బోధ – లాలించిన – సదయుడ నీ శక్తి – హృదయాల లేకున్న – కలుషాత్ములము తండ్రి ॥పరి॥
చరణము 3
సత్య స్వరూపా రమ్ము – మమ్ముల సర్వ – సత్యములో నడుపుము – సత్యాత్మ నీ శక్తి – సంపత్తితో దైవ – కృత్యము లొనరింప – గ్రుమ్మరింపుమా శక్తి ॥పరి॥
చరణము 4
వాక్యమందలి భావముల్ – లోతుగ దర్శించి – వచియింప దరమె మాకు – వాక్యోపదేశివిగా – వచ్చి మాలో నిలచి – వాక్యమందలి జీవ – భావాలు తెలుపుమా ॥పరి॥
చరణము 5
సాధక బాధకముల – నిలయంబైన – సంసార సాంద్రములో – ఆదరణ కర్తవుగా – నరుదెంచి మా సర్వ – బాధల దొలగించి – మోదంబు గూర్చుమా ॥పరి॥