#247

పరిశుద్ధాత్ముని ప్రాపు

రాగం: కాంభోజి (ఛాయ: అన్ని కాలంబుల) · తాళం: అట · రచయిత: నూగాల తిమోతి జ్ఞానానందము

Category: క్రీస్తు శ్రమలు — మరణము · Open in the hymnal app

పల్లవి · Pallavi
పరిశుద్ధాత్మ ప్రభుని – వరదివ్య శక్తి బం – ధురము ధరణికి జీవ – సంజీవము – పరమౌన్నత్యంబైన – పరలోక సువిశేష – పరమార్థములు దెలుపు నేరుగా మార్గము ॥పరి॥
చరణము 1
ఆపత్కాలమునందు – ప్రాపయి మానవజాతి – కాపయి సంరక్షించి – ఏపారును – పాపాంధకారమున బడి ద్రమ్మిగి శోకించు – పాపజాతికి దీపరాశియై రహియించు – కృపయు గనికరములు గుంభించి – మధురాతి – ప్రభగా భాసిల్లెడు పరమార్థము – అపభ్రంశకార్యముల కెప్పుడు తావియ్యక – సుపురోగతిని జూపి శోధించును ॥పరి॥
చరణము 2
బండలను పగుల జేయు – గుండెలను కదిలించు – నిండు శక్తి పుట్టించు నీతి బెంచు – ఎండిన యెదలను నిందించు రక్షణాతో – దండవిలసిత భాగ్య దానములు – దండిగా నసమాన ధైర్యోత్సాహములిచ్చి – మెండుగా నాదరము మేళవించి – మండుచున్న పాప మరణాగ్ని జ్వాలల – నుండి పాపిని గాచుచుండయుచు ॥పరి॥
చరణము 3
శాంతి సమాధాన – సౌజన్యభావములు – కాంతిమంతము గల్గు కారుణ్యము – అంతము లేనట్టి – ఆనంద శుద్ధాత్మ శాంతిదాంతి యొసంగి సంరక్షించు – ఎంతో సంతోషముతో – అంతు బొంతు లేనివి – క్రాంతి బల త్యాగముల – గావింపజేయు – చింతా ధ్వాంతములోన – చెదర గొట్టక పోవు – శాంతిలేని జనతకు – సౌఖ్యాస్పదము ॥పరి॥