#246
పరిశుద్ధాత్మ కొరకైన ప్రార్థన
పల్లవి · Pallavi
పరిశుద్ధాత్ముడ ప్రభువా! – వరదా! మా హృదయమం – దిరముల వసియింపుమా – అరుదైన నీ దివ్య – తేజశ్శక్తులను దాల్చి – త్వరగా మాపై దిగుమా కరుణాబ్ధివై యిప్పుడు ॥పరిశుద్ధాత్ముడ॥
చరణము 1
పరమండలాగ్నివై – యరుదెంచి మా హృదయాం – తర దురితచాతాలంబును – దరికొల్పి పరిశుద్ధ పరచి మా యాత్మల మా – వరగ రక్షకునకును – అర్పణముగా నిడుమయ్య ॥పరిశుద్ధాత్ముడ॥
చరణము 2
కాంతు లీనాటి దీప – కలికమై వచ్చి మా – స్వాంతంబుల గప్పిన – యంత లేని యా విద్య – ధ్వాంతంబు జూపి సు – స్వాంతులై గెడు సత్య – శరణి జూపింపూమా ॥పరిశుద్ధాత్ముడ॥
చరణము 3
చలువ గూర్చెడు మంచు – జల రూపమున మ – మ్ములను ఎల్ల దీవింపుమా – ఫలశూన్యమైన యా – ఆత్మలకు నీ బల మొసంగి – ఫలవంతములుగా గే – వలుడా యొనరింపుమా ॥పరిశుద్ధాత్ముడ॥
చరణము 4
పరమ పారావతమా! – పక్షములు విప్పి మా – శిరములపైని చాచి – పరమందు నీ సంఘ – పరిశుద్ధులకు వలెనే – ధరణినున్న మాకు నీ – వరముల నిడుమయ్య ॥పరిశుద్ధాత్ముడ॥
చరణము 5
దివినుండి భువికి నా – వరముతో వీతంచు – పవమానాకారుండై – నవ జన్మ సంప్రాప్తి క – విరోధము యొనరించు – భవ దుఃఖాంబుద పటలి బార ద్రోలుము కృపచే ॥పరిశుద్ధాత్ముడ॥
చరణము 6
అందమౌ నీ మోము – నందు జిందిడు తేజ – మందరు వీక్షింపగా – విందై వచ్చి మా – డెందంబులకు నిత్యా – నందంబు గూర్చి మా – వందనంబులు గొనుమా ॥పరిశుద్ధాత్ముడ॥