#243

పరిశుద్ధాత్మ కొరకైన మన యావశ్యకత

రాగం: కల్యాణి · తాళం: త్రిపుట · రచయిత: బేతాళ జాన్

Category: క్రీస్తు శ్రమలు — మరణము · Open in the hymnal app

పల్లవి · Pallavi
పరిశుద్ధాత్మను గోరుము – జీవమ యేసు – प्रभुని పేరిట వేడుము – నరులందరి మీడ – నా యాత్మ నుంతునని – పరలోకపు తండ్రి – పలికె వేదమునందు ॥పరిశుద్ధాత్మను॥
చరణము 1
పరిశుద్ధాత్మ లేనిది – వేదాగమ – పఠన పఠనము గాదది – నెర చీకటింట సర – కులు వెదకు రీతి ప – ల్మరు వెదకినను నిర – ర్థకమై పోవును వేగ ॥పరిశుద్ధాత్మను॥
చరణము 2
పరిశుద్ధాత్మ లేనిది – వర్షము లేని – పైరు చందంబే యది – పరబోధకముల వ – రిక్తమైన పనులు జీ – వరహితములై యను – భవము గానివై యుండును ॥పరిశుద్ధాత్మను॥
చరణము 3
పరిశుద్ధాత్మ లేనిది – యేసు ప్రభుని – నెరుగుటెరుగుట గాదది – నర రూపము దాల్చి దు – రన్వరుల రక్షణకొరకు – మరణమొందిన ప్రభుని – కరుణాధికము వడియ ॥పరిశుద్ధాత్మను॥
చరణము 4
పరిశుద్ధాత్మ లేనిది – జీవము లేని – బ్రతుకే బ్రతుకు గాదది – దురిత చేష్టలను గొప్ప – యురులందగిలి భక్తి – తరిగి పోవుట కద్ది – దొరకనందున మమ్ము ॥పరిశుద్ధాత్మను॥
చరణము 5
పరిశుద్ధాత్మను బొందుట – అన్నిటికన్న – ప్రబలమైన మేలిట – నెర నమ్మి మొరబెట్టు – పరమ పావనుడద్ది – కరుణించి నీ కొసంగు – మరణాంతమగు దనుకు ॥పరిశుద్ధాత్మను॥