చరణము 1
దైవాత్మ పరిశుద్ధుడా – ధారాళ ప్రేమను – దండిగ నిచ్చి మమ్మును దయతో దీవించుము.
చరణము 2
మా యాజ్ఞానాంధకారము ద్రవము చేయుము నీ యెక్కువైన తేజము – మా యందు పోయుము.
చరణము 3
మా దురుణంబు లెల్లను – చెదరగొట్టుము మా పాప మణచుటకై నీ శక్తి జూపుము.
చరణము 4
సన్మార్గమందు నిత్యము మమ్ము నడుపుము నీ మోక్షమందు పిమ్మట – మమ్మాదరింపుము.