#244

పరిశుద్ధాత్మా, రమ్ము

రాగం: ఆనందభైరవి (ఛాయ: తనువునాదిదిగో) · తాళం: అట · రచయిత: కడియం గాబ్రియేలు

Category: క్రీస్తు శ్రమలు — మరణము · Open in the hymnal app

పల్లవి · Pallavi
పరిశుద్ధాత్ముడ దేవా! – ప్రభువా నీ కరుణ మా – పైన వర్షించుమయ్య – వరుడా నీ భక్తుల – మనముల నాత్మల – బలపరిచి రక్షించి – మరి స్వస్థత నిడుమయ్య ॥పరిశుద్ధా॥
చరణము 1
బలమౌ నీ వెలుగుచే – బలు దేవ భాషల – ప్రజల కందరకై క్యము – గలిగించి విశ్వా – సమున వారి నొనగూర్చి – వెలయుచుండెడు నీకే – వినతుల్ సలుపుదుమయ్య ॥పరిశుద్ధా॥
చరణము 2
బలమౌ దురవమౌ మిగుల – పావనంబగు వెలుగే! – ప్రభువా దేవుని జ్ఞానము – గలిగించి మదితోడ – బిలువ దండ్రి యంచు – వెలుగు సత్యమునౌ నీ – బల వాక్యమిడు మాకు ॥పరిశుద్ధా॥
చరణము 3
విపరీత బోధలను – వేరౌ బోధకులను – విడువ మా కిడు సాయము – కృప నొప్పు యేసే మా – గురువంచు మది నమ్మి – యపనమ్మికను మాని – యవనిం బ్రతుక నిమ్ము ॥పరిశుద్ధా॥
చరణము 4
పరిశుద్ధతకు నూట – నెర నెమ్మదికి కర్తా – జరిగింప నీ యాజ్ఞలన్ – త్వర నొందు చరణములు – స్థిర డెందమును నిమ్ము – పరిశోధనలు గలుగ – భయమొంద నీయకుము ॥పరిశుద్ధా॥
చరణము 5
మరణ జీవంబుల – స్థిర యోధులను బోలి – పరుగెత్త నీ దారినే – తిరుగక దప్పిన వేళ – దేహంబునకు శక్తి – గరిమతో నిడి సిద్ధ – పరచుము మమ్ము ప్రభువా ॥పరిశుద్ధా॥