#239

పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించుట

రాగం: ముఖారి (ఛాయ: యేసు కరుణ) · తాళం: అట · రచయిత: తూలూరు కొర్నేలియస్

Category: క్రీస్తు శ్రమలు — మరణము · Open in the hymnal app

పల్లవి · Pallavi
ఆత్మా నడుపు సత్యము లోనికిపుడే – యాత్మా నడుపు – ఆత్మా నీ సాయంబు – నధికంబుగా నిచ్చి – ఆత్మానందముతో దై – వారాధనమున ॥ఆత్మా॥
చరణము 1
ఘోర కలుషంబుల – దూరంబుగా దోలి – పారమార్థిక బుద్ధి – గోరు నటులను ॥ఆత్మా॥
చరణము 2
అంధత్వంబు వలన – మందమైయుండు మా – డెందంబు లెల్ల నీ యందు వెలుగుటకు ॥ఆత్మా॥
చరణము 3
నిర్మల హృదయంబు – నిరతంబు మా కిచ్చి – కూర్మితో నీ వరముల – గూర్చి దీవించి ॥ఆత్మా॥
చరణము 4
సకల మానవులతో – అకలంక శుభ వార్త – ప్రకటించు బల జ్ఞాన – నికరంబు నిచ్చి ॥ఆత్మా॥
చరణము 5
దీవించి పంపు మో దైవాత్మా మమ్మును భా – వజ్ఞాన మొసంగి – ప్రభు సేవలోన ॥ఆత్మా॥