#238
పరిశుద్ధాత్మ కొరకు వేడుట
పల్లవి · Pallavi
దైవాత్మ దిగుము దాసుల పైని – నీ దయా దృష్టి – పారజేయుము ప్రేమను నింపు – దేవా యాత్ముండ దిగుము మమ్ములను – శుద్ధి కరింపుము – దయారసముచే ॥దైవాత్మ॥
చరణము 1
దైవాత్మ దిగుము ప్రవక్తలు – పూర్వంబు నీదు – ప్రేరణవలన ప్రవచించిరి – పావురమా దిగి – మాలో వసింపుము – పాపము చీకటి – వెలుగుచు మాలో ॥దైవాత్మ॥
చరణము 2
రమ్ము ఓ యున్నతపు ఆత్మ – నాలుగు దిశలనుండి మమ్ములను నా వరింపుము – రమ్ము రమ్ము దిగి – యెండిన యెముకలుగా నగు లోకులకు – మీదికి ముదమున ॥దైవాత్మ॥
చరణము 3
మేము మా జ్ఞానాంధకారమునను – మునిగితిమి గాన – చెదరజేయుము మంధకారము – పామర జనులకు – బేరిత తో నొసంగును – జ్ఞాన ప్రకాశము – నిల్పుము మాలో ॥దైవాత్మ॥