#237
పరిశుద్ధాత్మ స్తుతి
పల్లవి · Pallavi
పరిశుద్ధాత్మ నిత్యాత్మ – పరమ పావురమావదురతేచ్ఛలను దూర – పరచు సత్యాత్మ ॥పరిశుద్ధాత్మ॥
చరణము 1
నిత్యంపు వెల్గుచే – నింపు జ్ఞానాత్మ – సత్యంపు శుభ వార్త – సంధించు నాత్మ ॥పరిశుద్ధాత్మ॥
చరణము 2
జీవమార్గంబున – జీవింప నేర్పి – త్రోవ తప్పిన వారి – భావంబు మార్చు ॥పరిశుద్ధాత్మ॥
చరణము 3
పాపాంధకారంబు – బాపు నీ వెలుగు – చూపి మింటికి నడిపి – కాపాడి మెలగు ॥పరిశుద్ధాత్మ॥
చరణము 4
భక్తుడు శోధింప – బడుచుండునేని – యుక్తి దెల్పెడి సర్వ – శక్తి నీదౌను ॥పరిశుద్ధాత్మ॥
చరణము 5
తిన్ననైన తెలివి – తేట నాకిమ్ము – నిన్ను సేవింతును – నిజము స్తోత్రమ్ము ॥పరిశుద్ధాత్మ॥