#236

క్రీస్తు పునరాగమనము

రచయిత: డి. డి. నిత్యానందము

Category: క్రీస్తు శ్రమలు — మరణము · Open in the hymnal app

పల్లవి · Pallavi
రాజాధి రాజా రారా – రాజులకు రాజువై రారా – రాజ యేసు రాజ్యమేల రారా – రవి కోటి తేజ యేసు రారా ॥ఓ ... మేఘ వాహనంబుమీద వేగమే – ఓ ... మించు వైభవంబుతోడ వేగమే ॥రాజాధి॥
చరణము 1
ఓ ... భూజనంబులెల్ల తెరి చూడగా – ఓ ... నీ జనంబు స్వాగతంబు నియ్యగా – నీ రాజ్యస్థాపనము సేయ – భూరాజులెల్ల గూలిపోవ – భూమ్యాకాశంబు మారిపోవ – నీ మహా ప్రభావమున వేగ ॥రాజాధి॥
చరణము 2
ఆ ... ఆకాశమున దూత లార్భటింపగా – ఆ ... ఆదిభక్త సంఘ సమేతంబుగా – ఆకాశంబు మధ్య వీధిలోన – ఏకమై మహాసభ చేయ – యేసునాథ! నీదు మహిమలోన – మాకదే మహానందమౌగ ॥రాజాధి॥
చరణము 3
ఓ ... పరమ యెరూషలేము పుణ్యసంఘమా – ఓ ... గొర్రెపిల్ల క్రీస్తు పుణ్యసంఘమా – పరమదూతలారా! భక్తులారా! పౌలపొస్తులులారా! పెద్దలారా! గొర్రెపిల్ల యేసు రాజు పేర – క్రొత్త గీతమెత్తి పాడరారా ॥రాజాధి॥