#230

అంత్యదినము

రాగం: వంతువరాళి · తాళం: ఆది · రచయిత: పురుషోత్తము చౌదరి

Category: క్రీస్తు శ్రమలు — మరణము · Open in the hymnal app

పల్లవి · Pallavi
అయ్యో యిది యెంత దుఃఖము – ప్రభు తీర్పువేళ – నయ్యో యిది యెంత దుఃఖము – చయ్యన యెహోవా సింహా – సనము చుట్టు వహ్ని మండు – నయ్యెడ విశ్వాసులకు దు – రాత్మల కగు నిత్య ఖేద ॥మయ్యో॥
చరణము 1
తల్లి పిల్లలు గూడుదురచట – దండ్రి తాతలు అచట గలియుదురెల్ల కాలమటుల నుండ – కెడబాపబడి మరి యెప్పుడు చూడ ॥రయ్యో॥
చరణము 2
అన్నదమ్ములు అచట – గూడుదురు రక్త సిల్సియ లందు గలియుదురు – రెన్నడు మరి చూడరాని – యెడగల స్థలములకు బోదు ॥రయ్యో॥
చరణము 3
భార్యాభర్తలు గూడుదురచట – బంధు మిత్రులు కలియుదురందున – కార్య భేదమువలన సర్వ – కాలము మరి గూడజాల ॥రయ్యో॥
చరణము 4
క్రీస్తు మత ప్రబోధకులు స – మస్త శిష్యులు కూడుదురచట – వాస్తవ స్థితి లెరుగబడి – వలసను విడబడుదురంద ॥రయ్యో॥
చరణము 5
శిష్టులు దుష్టులు కూడుదురచట – స్నేహవంతులందు గలియుదురు – రిష్టము గాని భిన్నలగుచు – నింక మరి యెన్నటికి గూడ ॥రయ్యో॥
చరణము 6
అల పిశాచి పాపులందరు – నడుపు కర్తకు భిన్నులగుచు – పలు గొరుకుల నిత్య నరక – బాధల పాలబడక పోరు ॥అయ్యో॥
చరణము 7
సాధు సజ్జనంబు లెల్ల – సకల దూతలతోడ గూడి – మోదముతో – ప్రభుని వెంట – ముక్తి కేగి నిత్యులగుదురు – రాహా యిది యెంత విజయము ప్రభు తీర్పు వేళ – నాహా యిది యెంత విజయము ॥అయ్యో॥