#231
క్రీస్తు శరణు గోరుట
పల్లవి · Pallavi
ఓహోహో మా యన్నలారా – యుద్యోగింపుడి – ఇప్పుడే – త్రాహి త్రాహి యనుచు – క్రీస్తుని – దయను గోరండి ॥ఓహో॥
చరణము 1
అంత్యదినము నాటి బాధ – లాలకించండి – నరక – ప్రాంతమునకు బోకమునుపే – ప్రభువును వేడండి ॥ఓహో॥
చరణము 2
మింట ప్రభువు తేజోమయమౌ – మేఘారూఢుండై – యగ్ని – మంట వీను సింహాసనము – నంటి కూర్చుండు ॥ఓహో॥
చరణము 3
అంధకారమగును సూర్యుడా దినమందు – కుముద – బాంధవుడు మిగుల రక్త – వర్ణము నొందును ॥ఓహో॥
చరణము 4
కడు భీతిగ సర్వసృష్టి – కంపించుచు నుండున్ – భూమి కదలి యభ్రము.ప్రేమతో నడిగెదను నా – ప్రియబంధువులారా – మీర – లామహా దినమందున ధిరమై – యట నిలువగలరా ॥ఓహో॥
చరణము 5
కామక్రోధ లోభమోహ – గర్వ గుణములను – మీరు – ప్రేమించి చేసితిరి గద – పెక్కు విధములను ॥ఓహో॥
చరణము 6
కల్లలాడుచుడి ప్రొద్దు – గడుపుచుంటిరే – ఇంక – చిల్లర వేల్పుల పూజ – చేయుచుంటిరే ॥ఓహో॥
చరణము 7
ప్రకటంబుగ నైన మరి గు – ప్తస్థల మందైన – చేయు – సకల క్రియలు ప్రభువున కెరుక – సంపూర్ణముగాను ॥ఓహో॥
చరణము 8
జాతి గోత్రమడుగ బోడు – సర్వేశ్వరుండు – క్రియల – రీతి మనసు మాత్రమె విచా – రించు ప్రభువతడు ॥ఓహో॥