#229

క్రీస్తు మహిమతో వచ్చుట

రాగం: ఘంటా · తాళం: అట · రచయిత: గొల్లపల్లి నతానియేలు

Category: క్రీస్తు శ్రమలు — మరణము · Open in the hymnal app

పల్లవి · Pallavi
మహిమతో మన యేసు – ఇహమునకు వేంచేయున్ – సహోదరులారా మన మా – మహిమలో వెలుగుదము ॥మహిమతో॥
చరణము 1
మోములు వంచి యేసు – నామము నుతియించు – పామరులమైన మనల – బ్రేమతో గప్పినాడు ॥మహిమతో॥
చరణము 2
పాత్రులమా మనము – శత్రువులమే కాదా – మిత్రులను జేసినవి – చిత్రము తెలియలేము ॥మహిమతో॥
చరణము 3
శిరముల పైని జీవ – కిరీటములతోను – బరము దేవుని వరములు – మురియుచు మరువలేము ॥మహిమతో॥
చరణము 4
వీణలతో మనము – నాణ్యమైన పాట – ఋణము చెల్లించలేమని – యణగి మణగి పాడుదము ॥మహిమతో॥