#228

క్రీస్తు యొక్క రెండవ రాకడ – అవిశ్వాసుల భయము

రాగం: ముఖారి (ఛాయ: హృదయమనేడు) · తాళం: ఆది · రచయిత: పురుషోత్తము చౌదరి

Category: క్రీస్తు శ్రమలు — మరణము · Open in the hymnal app

పల్లవి · Pallavi
నాడు వచ్చినట్లు గాదు – నేడు వచ్చుట – తెరి – చూడరాదు క్రీస్తు నింక – జొత్తు మెచ్చుట ॥నాడు॥
చరణము 1
మొదట గొర్రెపిల్ల రీతి – నొదిగి వచ్చెనుగా – ఇప్పుడు – కొదమ సింహమయ్యె మనకు – గుండె దిగులుగా ॥నాడు॥
చరణము 2
దాసుని వలె దొల్లి – నిలిచినాడుగా – ఇప్పుడు – దోషము లెంచి దండీంప – దొరయైనాడుగా ॥నాడు॥
చరణము 3
ఏ తట్టు బోయిన మనకు – నెదురు వచ్చెనుగా – పిడుగు – రీతి వాని యుగ్రమైన – దృష్టి హెచ్చుగా ॥నాడు॥
చరణము 4
కొండ వండలందు దాగి – యుండలేముగా – వాని – యెండనుండి మండు నగ్ని – యదిగో వచ్చెనుగా ॥నాడు॥
చరణము 5
దిక్కుగా నున్నట్లు నితర – దేవతలను నమ్మి – నట్టి – పుక్కిటి పురాణములకు బోయి చెడితిమి ॥నాడు॥
చరణము 6
వీధుల బోధించు వారి – వినక పోతిమి – ఇప్పుడు – బాధ పొంది నరకాగ్నిలో – బడి బలైతిమి ॥నాడు॥