#225

ఆరోహణ దినము

రాగం: ఆనందభైరవి (ఛాయ: ఓ మా తండ్రి నీదు నామము) · తాళం: ఏక · రచయిత: బన్యన్ జోసెఫ్

Category: క్రీస్తు శ్రమలు — మరణము · Open in the hymnal app

పల్లవి · Pallavi
పరమ ప్రభు యేసు రక్షకా – ధననరుల బ్రోచి – పరమ కారోహణంబైతివా – మరియయందు జననమొంది – వరము లిడుచు దిరిగి ధరను – మరణమొంది తిరిగి లేచి – పరము కేగితివా ప్రభో ॥పరమ॥
చరణము 1
ఘోర పాప భారముతోడ – దరిగానలేక – తిరుగుచుండినట్టి మమ్మును – కూరిమితో దరికి బిలిచి – భారమును నీవే మోసి – తూరకము క్షమియించి – నేరములను బాపిన ప్రభో ॥పరమ॥
చరణము 2
సిలువ మరణమొందిన ప్రభువా – ఇలనరుల ఘోర – కలుషములను బాపిన ప్రభువా – విలువలేని నీదు బ్రతుకు – బలముగల నీ ప్రేమ సేవ – సలలితముగ నన్ను కరించి – ఇలను మేము బ్రతుకునట్లు ॥పరమ॥
చరణము 3
చెరను చెరగ బట్టిన ప్రభువా – ధననరుల కెల్ల – వరములను విరివి నిడితివా – పరముకేగి పరమతండ్రి – పరమున కుడిపార్శ్వమందు – స్థిరముగా గూర్చుండి యుండి – తిరిగి ధరకు వచ్చెదవా ॥పరమ॥
చరణము 4
నీదు రాక కెదురు చూచెడి – నీ దాసులను – సదయతతో జూడుమా ప్రభో – మాదినపు ప్రార్థనలను – మాదు స్తోత్రములను మిగుల – బోదిగా గైకొనుచు నేడు – బ్రోవుమయ్య మమ్ములను ॥పరమ॥
చరణము 5
పంపుమయ్య నీదు ఆత్మను – పదిలముగ దయతో – సొంపుగ నీ శుద్ధాత్మను – నింపుమయ్య నీదు కృపతో – ఇంపుగ నీ వరములతో – సొంపుగాను నీదు సేవ – చేయనిలను నేలప్పుడు ॥పరమ॥