#224
క్రీస్తు కడపటి హెచ్చరిక
పల్లవి · Pallavi
ఇదిగో నా శిష్యులారా యెరుక లుంచుకొనుడి – మోక్ష సదనమున కేను బోదు – సంతోషించుకొనుడి ॥ఇదిగో॥
చరణము 1
యెరూషలేమందుండి మీ – రెదురు చూడుడి – మీపై – పరిశుద్ధాత్మయు దిగివచ్చి – పనులు దెల్పును ॥ఇదిగో॥
చరణము 2
దిక్కు లేనట్లు మిమ్ము – దిగనాడి పోను – మీతో – మక్కువైయుండి పరిశుద్ధాత్మను బంపెదను ॥ఇదిగో॥
చరణము 3
నిర్యాణమున మీకొరకై నెలవులు గల్పింతు – నాతో – సర్వకాలము నిత్య – సామ్రాజ్యము నేల ॥ఇదిగో॥
చరణము 4
ఒకరితో నొకరు ప్రియము – లొప్పయుండుడి – నాదు – సకల జనులందు నిదియే – సారమనుకొనుడి ॥ఇదిగో॥
చరణము 5
ఏదైనా నా పేరిట మీ – రించుక వేడినను – మీకు – మోదముతోడ దాన్ని – ముందే చేయుదును ॥ఇదిగో॥
చరణము 6
ఉలవము లందు గల కలత – లెల్ల విడువుడి – నేను – మళ్ళి వచ్చెడి విధము – మరువకుండుడి ॥ఇదిగో॥