#223

ప్రభుని ప్రత్యక్షతలు

రాగం: శంకరాభరణము (ఛాయ: యేసుని ప్రేమను నేమారకను) · తాళం: ఆది · రచయిత: మల్లెల దావీదు

Category: క్రీస్తు శ్రమలు — మరణము · Open in the hymnal app

పల్లవి · Pallavi
క్రీస్తు ప్రభుని ప్రత్యక్షతలను వివ – రించెద వినరే ప్రియులారా – వాస్తవముగా మరణించి బ్రతికెనని – వసుధలోన బ్రకటింపరే యూరూరున్ ॥క్రీస్తు॥
చరణము 1
మరియ మగ్దలేనేకున్ ప్రథమంబున – మన గురువర్యుండగ పడెనాయెన్ – తరుణీమణులకు రెండవదాని మార్కొక – దర్శనము దయతో నిడియెన్ ॥క్రీస్తు॥
చరణము 2
సీమోనను పేతురును గూడ ద – రిశించె నతడు మూడవ మారు – ప్రేమతోడ నిమ్మాను శిష్యులకున్ – బ్రియుడొనరించె మరొక ఫీరు ॥క్రీస్తు॥
చరణము 3
తోమా లేని తరుణమున బదుగురి – తో వచించె గృహమున జేరి – తోమాకు కనపడి యతని సంశయమున్ – దొలగించెను ప్రభుడొక్కసారి ॥క్రీస్తు॥
చరణము 4
సందరంపు దరి నేడుగురికి మ – త్స్యంబులు వింతగ సమకూర్చే – సందర్శించియు యాకోబునకును – సంతోషము నెంతయు గూర్చే ॥క్రీస్తు॥
చరణము 5
ప్రభుడొక్క మారే నూరుగురి దా – బ్రత్యక్షుండయ్యెను పేర్మి – నష్టయ మొసంగి యపొస్తలులకున్ క్రీ – స్తారోహణుండయ్యెను గూర్మి ॥క్రీస్తు॥
చరణము 6
హత్య జేయ నేగెడు తార్సున – కగపడి రక్షించెను సుమ్ము – మృత్యుంజయుడిప్పుడు మన కాత్మలో – దృశ్యుండగు నిది సత్యమ్ము ॥క్రీస్తు॥