#226

క్రీస్తు ఆరోహణము

రాగం: ఆనందభైరవి (ఛాయ: నీకన్న యిక వేరే) · తాళం: త్రిపుట · రచయిత: తూలూరు ప్రకాశము

Category: క్రీస్తు శ్రమలు — మరణము · Open in the hymnal app

పల్లవి · Pallavi
మేఘంబుపై నెక్కి – మేలుగా ప్రభు క్రీస్తు – యాకసంబున కేగెను – ప్రాకటముగాను ఆత్మనంది – ప్రజ్ఞ మీరగ సాక్ష్యమిచ్చి – యేక దీక్షను యేసు రాకకు – నెదురు చూడుడంటు ప్రభువు ॥మేఘంబుపై॥
చరణము 1
యూదయ – సమరయ – ప్రాంతంబులంతట – నాదు వార్తను చాటరే – భూదిగంతము వరకు మీరు భూరి సాక్షులగుచు నాకు – సాదరంబుగ సత్య విశ్వా – సంబులను మనుడంచు ప్రభువు ॥మేఘంబుపై॥
చరణము 2
గలిలయులారా మీ – రాశతో నెందుకు – తిలకించు చున్నారట్లు – వెలయ పరమున కెట్లు నేగెనో – ఇలకు నా ప్రభు వట్లె మరల – యలర వచ్చుట మీరు గాంచెద – రంచు దూతలు పల్కిరప్పుడే ॥మేఘంబుపై॥
చరణము 3
శ్రీ సంఘమిది వినుమా మా యేసు ప్రభు క్రీస్తే – భాసిల్ల మరి వచ్చును – యేసు ప్రభుని యడుగు జాడల – యేపు మీరగ నడుచుకొనుచు – నీ సురక్షణ నిలకు చాటుచు – నెదురు చూడుము యేసు కొరకై ॥మేఘంబుపై॥