#220
క్రీస్తు పునరుత్థానము
పల్లవి · Pallavi
యేసు పునరుత్థానమాయెను – చావునొంది క్రీ – స్తేను పునరుత్థానమాయెను – యేసు పునరుత్థానమాయె – దాసులెల్ల నుతింప వింతగా – భాసురంబుగా భక్తులన్ భర – వాసులుగా దాజేయు నిప్పుడు ॥యేసు॥
చరణము 1
భేదపడి యా సిలువమీదను – దుష్టాత్ములాయన – నాదరంబుగ బట్టి మోదెను – పాదుకొని ప్రేమన్మతినెంతరి – పంది జనుల గావుమంచును – సాదరంబుగా వేడె తండ్రిని – శత్రువులను రక్షింప నిప్పుడు ॥యేసు॥
చరణము 2
దుష్ట జను లేతెంచుచున్నారు – నన్ను బట్టి చాలగా – గష్ట పెట్ట దలంచుకొన్నారు – విష్టపంబున సిలువమీదను – వేదన క్రూరముగ బెట్టుచు – భ్రష్టులైనను బాసిమారక – పారిపోయెదరంచు నిప్పుడు ॥యేసు॥
చరణము 3
ఆ మహిమ పరి శుద్ధవంతుడై – జన్మించె దేవుని – నీయందున నీతిమంతుడై – ఈ మహిని బోధింప దోష వి – హీనుడైన నిరపరాధిని – స్వామి ద్రోహిగా నెంచి యూదులు – చంపి పూడ్చిపెట్ట నిప్పుడు ॥యేసు॥