#219

క్రీస్తు లేచెను

రాగం: యమునా కల్యాణి (ఛాయ: నేనును నా యింటివారును) · తాళం: త్రిపుట · రచయిత: బి. సూర్య ప్రకాశరావు

Category: క్రీస్తు శ్రమలు — మరణము · Open in the hymnal app

పల్లవి · Pallavi
క్రీస్తు లేచెను హల్లెలూయ – క్రీస్తు నన్ను లేపును – ఇదియే సునాద సత్యము – ఇలను చాటుడి నిత్యము ॥
చరణము 1
మృతుల పునరుత్థాన పంటకు – ప్రథమ ఫలమగు క్రీస్తులో – మృతులు లేతురు నేను లేతును – నాదు వరుసలో నిజమిది ॥
చరణము 2
పాపమరణ నరక బలములు – ప్రభుని శక్తికి ఓడెను – పాపినగు నన్ను బ్రోవ క్రీస్తుని – ప్రాణదాన ప్రభావము ॥
చరణము 3
మరణమా! నీ ముల్లు ఎక్కడ? – మరణమా! జయమెక్కడ? – మరణమా! నీ ముల్లు విరిగెను – మహిమ క్రీస్తులో నిప్పుడు ॥
చరణము 4
శిలయు ముద్రయు బలిమి కావలి – గిలబిలాయెను రాత్రిలో – ఇలయు పరమును కలుసుకొనియెను – గెలుపునొందిన క్రీస్తులో ॥
చరణము 5
మృతులు నీదగువారలందరు – బ్రతికి లేతురు సత్యము – ప్రేతలను జీవింపచేయును – పృథివి క్రీస్తుని విజయము ॥
చరణము 6
స్తుతియు మహిమయు ఘనత నీకే – స్తుతికి పాత్రుడ రక్షకా – స్వంత రక్తము చింతివి నా – స్వామి యిదే నా యంజలి ॥