#216

ప్రభు పునరుత్థానము

రాగం: అసావేరి (ఛాయ: ఇప్పటి నరులారా) · తాళం: త్రిపుట · రచయిత: జాన్ ఫ్రాన్సిస్ స్పెన్సర్

Category: క్రీస్తు శ్రమలు — మరణము · Open in the hymnal app

పల్లవి · Pallavi
విజయంబు విజయము – విజయము మా యేసు – నిజముగా మృత్యువు గెల్చి – నేడు వేంచేసే – యజమానుడెల్ల ప్ర – యాసము లేక బాపె – స్వజనుల రక్షింప – సమసె సిలువమీద ॥విజయంబు॥
చరణము 1
విజయంబు విజయము – విజయంబు మానవుల – మృతిని నివృత్తిని – విభుడు ఒనరింపన్ – కుజనులచే నతడు క్రూర – మరణము నొంది – విదిత మృత్యువు నుండి – విజయుడై వేంచేసే ॥విజయంబు॥
చరణము 2
విజయంబు విజయము – విజయంబు మా యేసు భు – జము మీ దను మోయు – బరిపాలనంబు – కుజము మీ దను ప్రాణ – త్యాజనము జేసెను – ధ్వజము మోయుచు సిలువ – పాప మోచనంబు ॥విజయంబు॥
చరణము 3
విజయంబు విజయము – విజయంబు ఇంకను మాకు – పజయంబు కాకుండా – ప్రభు యేసు క్రీస్తు – సుజనత్వమున వైరి – వ్రజము గెల్వగజేసి – నిజముగా పరలోక – నిలయంబులో నిలుపు ॥విజయంబు॥
చరణము 4
విజయంబు విజయము – విజయం బనెడి పాట – నిజభక్తితో మనము – నేర్చిన వాని – భజియించుదము భాను – భవములు తా బాలించు – అజిత జీవ ప్రదాత – డమృతత్వమిడు మనకు ॥విజయంబు॥